గవర్నకు వైకాపా శాసనసభ్యుల ఫిర్యాదు

హైదరాబాద్‌: సహకార సంఘాల ఎన్నిల ప్రక్రియలో అవకతవకలు జరుగు తున్నాయని పేర్కొంటూ వైకాపా శాసనసభ్యులు ఫిర్యదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణచేసి పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించలని వైకాపా ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, సుచరితలు కోరారు. నిబంధనల ప్రకారం తమకు ఓటర్ల జాబితాను అందివ్వాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం చేస్తొందని వారు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఓటరు నమోదులోనూ భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని వారు విమర్శించారు. మజ్లిస్‌ పార్టీతో రహస్య ఒప్పందం చేసుకున్నట్లు తెరాస నేత వ్యాఖ్యానిండాన్ని వైకాపా నేతలు ఖండించారు.