గవర్నర్‌ని కలిసిన తేదేపా నేతలు, రైతులు

హైదరాబాద్‌: అదిలాబాద్‌ జిల్లా రైతులతో కలిసి తేదేపా నేతలు రమేశ్‌, రాథోడ్‌ సుమన్‌ రాథోడ్‌ నగేశ్‌ గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. అదిలాబాద్‌ జిల్లా ఏజేన్సీలో ఉన్న దళిత రైతులకు 1(70) యాక్ట్‌ వల్ల తీవ్ర అన్యాయం జరుగుతోందని నేతలు గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. 60, 70ఏళ్ల నుంచి దళితులు అక్కడే నివసిస్తున్నప్పటికీ ఈ చట్టం వాళ్ల భూములకు పట్టాలు లేవని వారికి రుణాలు అందడం లేదని వివరించారు. తక్షణం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని దళితులకు న్యాయం చేయించాలని గవర్నర్‌ను కోరారు. దీనిపై గవర్నర్‌ సానుకూలంగా స్పందించారని ముఖ్యమంత్రితో మాట్లాడతానని హామి ఇచ్చారని ఎంపీ రమేశ్‌ రాథోడ్‌, ఎమ్మెల్యే నగేశ్‌ తెలిపారు.ు.