గవర్నర్‌ తీసుకున్న నిర్ణయం సరైన చర్యే : దత్తాత్రేయ

హైదరాబాద్‌: మంత్రి ధర్మాన ప్రాసిక్యూషన్‌ ఫైల్‌ను వెనక్కి పంపుతూ గవర్నర్‌ నరసింహన్‌ తీసుకున్న నిర్ణయం సరైన చర్యగా భాజపా నేత బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రాజ్యంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనమని అన్నారు. నిరుద్యోగులతో ఆటలాడుకుంటున్న ఏపీపీఎస్సీ సభ్యులను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు.