గవాస్కర్‌ రికార్డుని అధిగమించిన సంగక్కర

కొలంబో:శ్రీలంక,పాకిస్తాన్‌ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ నాలుగో రోజు ఆట జరుగుతోంది ఒక వికెట్‌ నష్టానికి 135 పరుగులు చేసిన శ్రీలంక వద్యాహ్నం బోజన విరామానికి వెళ్లింది.అయితే సింహళీన్‌ స్పొర్ట్స్‌ గ్రౌండ్‌లో సాఫీగా సాగిపొతున్న ఈ ఆటలో కొన్ని ప్రతిష్ఠాత్మక రికార్డుల నమోదవడం విశేషం.బ్యాటింగ్‌ చేస్తున్న సంగక్కర(72)57 పరుగులు వద్ద ఈ మైదానంలో 2000 పరుగులు చేసిన రికార్డు సాదించాడు.ఒకే గ్రౌండ్‌లో ఇన్ని పరుగులు చేసిన బ్యాట్‌మోస్‌లో సంగక్కర నాలుగో క్రికెటర్‌.ఇక్కడ అతను 20 మ్యాచుల్లో 29 ఇన్నింగ్స్‌ ఆడాడు.అతని కెరీర్‌ బెస్ట్‌ 287 పరుగుల రికార్డు నమోదైంది ఈ మైదానంలోనే పాకిస్థాన్‌తో ఆడుతూ అత్తధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా కూడా సంగక్కర రికార్డు సాదించారు.