గాంధీ ఆసుపత్రిలో పట్టుబడ్డ నకిలీ డాక్టర్
హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో నకిలీ డాక్టర్‌ని సెక్యూరిటీ గార్డులు పట్టుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శివాని అలియాస్ సంధ్య (25) సోమవారం ఉదయం గాంధీ ఆసుపత్రిలోని ఓపీ విభాగంలో ఉదయం నుంచి మెడలో స్టెతస్కోప్, యాప్రాన్ కోటు ధరించి ఓపీ విభాగంలో తిరుగుతుండగా వార్డ్ బాయ్ గమనించి ఆరా తీశారు. ఎవరు నువ్వంటూ వార్డు బాయ్ ప్రశ్నించగా నేను డాక్టర్‌ని నన్నే ఆపుతావా అంటూ వార్డు బాయ్‌ను బెదిరించడంతో అనుమానం వచ్చి భద్రతా సిబ్బందికి తెలిపాడు. దీంతో వారు ఆమెను ఆసుపత్రి ఎల్ఆర్ఎంఓ వద్దకు తీసుకెళ్లి విచారించగా అసలు విషయం బయట పడింది. గాంధీ ఆసుపత్రిలో పట్టుబడ్డ నకిలీ డాక్టర్ (ఫోటోలు) 1/5 గాంధీ ఆసుపత్రిలో పట్టుబడ్డ నకిలీ డాక్టర్ గాంధీ ఆసుపత్రిలో నకిలీ డాక్టర్‌ని సెక్యూరిటీ గార్డులు పట్టుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శివాని అలియాస్ సంధ్య (25) సోమవారం ఉదయం గాంధీ ఆసుపత్రిలోని ఓపీ విభాగంలో ఉదయం నుంచి మెడలో స్టెతస్కోప్, యాప్రాన్ కోటు ధరించి ఓపీ విభాగంలో తిరుగుతుండగా వార్డ్ బాయ్ గమనించి ఆరా తీశారుఎల్ఆర్ఎంఓ హైమావతి విచారించగా తన పేరు సంధ్య అని, ఓ నర్సింగ్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నట్లు వివరించింది. ఆ సమాచారం తప్పని తేలడంతో సంధ్యను చిలకలగూడ పోలీసులకు అప్పగించారు.మరోవైపు ఈ యువతి పలుమార్లు ఫోన్ చేసిన బేగంపేటకు చెందిన అఖిల్ (22)ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఓపీలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అవుట్ పోస్ట్ ఇన్ ఛార్జి వెంకట్రావ్ తెలిపారు. ఇది ఇలా ఉంటే ఆసుపత్రిలోని ఓపీ విభాగంలో సోమవారం ఓ చోరీ సంఘటన వెలుగుచూసింది. జీడిమెట్ల ఐడీపీఎల్ గాంధీనగర్‌కు చెందిన విజయ చేతిలో ఉన్న సంచిని ఎవరో కత్తిరించారు. అందులో రూ. 3వేల నగదు, అరతులం బంగారు ఉందని ఆమె వైద్యాధికారులకు ఫిర్యాదు చేసింది.



