గాలిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

బళ్లారి: గనుల సరిహద్దుల చెరిపివేత, తపాలా గణేష్‌పై దాడి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కోంటున్న గాలి జనార్థన్‌రెడ్డి పోలీసులు ఈ రోజు సండూరు కోర్టులో హాజరుపరిచారు. గాలిని బళ్లారి కేంద్ర కారాగారం నుంచి భారీ బందోబస్తు నడుమ సండూరు కోర్టుకు తీసుకువచ్చారు. ఈసందర్భంగా బళ్లారిలో ఉదయం నుంచి 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు.