గాలి బెయిల్‌ కోసం 100 కోట్లకూ వెనకాడలేదు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ వ్యవహారం రోజుకో మలుపులు తిరుగుతుంది. తవ్విన కొద్ది కొత్త కొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి. తాజాగా మొన్న అరెస్టెన జడ్జి లక్ష్మినరసింహరావు సీబీఐ విచారణలో కళ్లు బైర్లుగమ్మె  నిజాలు వెల్లడించారు. గాలికి బెయిలిప్పిస్తే వంద కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్దమేనని గాలి దగ్గరి బంధువు దశరథరామిరెడ్డి ఆశచూపారని లక్ష్మినరసింహరావు అన్నారు. తాను అప్పటి సీబీఐ కోర్టు జడ్జి నాగమారుతి శర్మను సంప్రదించానని అయితే ఈ బెయిల్‌ డీల్‌కు శర్మ తిరస్కరించారని తెలియజేశారు.అనంతరం నాగమారుతి శర్మ బదిలి అయిన వెంటనే తాను పట్టాభిని ఆశ్రయించానని లక్ష్మినరసింహరావు వెల్లడించారు.