గాలి బెయిల్‌ పిటీషన్‌ పై విచారణ వాయిదా

హైదరాబాద్‌ : ఓబుళాపురం మైనింగ్‌ కేసుల్లో నిందితుడు గాలి జనార్థన రెడ్డి బెయిల్‌ పిటీషన్‌ ఈ రోజు హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా సీబీఐ బెయిల్‌ కోసం ఆయన ముడుపులు ఇచ్చిన విఫయాన్ని కోర్టు పరిశీలించాలని, అలాంటి వారికి బెయిల్‌ పొందే అర్హత లేదని వాదించింది. దీని పై నిర్ణయాన్ని కోర్టు రేపటికి వాయిదా వేసింది.