గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల ఆందోళన

మహబూబ్‌నగర్‌: గిట్టుబాటు ధర ఇవ్వటం లేదంటూ దేవరకద్రలో రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆగ్రహించిన రైతులు ఈరోజు ఉదయం దేవరకద్ర మార్కెట్‌ యార్డు కార్యదర్శి యాదగిరిరెడ్డిపై దాడిచేశారు. అనంతరం హైదరాబాద్‌-రాయచూర్‌ అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రెండున్నర గంటల నుంచి రైతులు రాస్తారోకో చేస్తున్నప్పటికీ ఉన్నతాధికారుల నుంచి స్పందన లేకపోవడంతో రైతులు ఆందోళనను ఉద&ఋతం చేశారు.