గీత కార్మికులకు ప్రభుత్వ ఐడి కార్డులు పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి

 

వీణవంక మార్చి 15 (జనం సాక్షి)వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికులకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఐడి కార్డులను బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి గీత కార్మికులకు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలోనే గీత కార్మికులకు న్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట గీత కార్మికులు ఉండాలని వారు కోరారు గీత కార్మికులకు ప్రమాదం సంభవిస్తే వారికి ఈ తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని గీత కార్మికులకు ఇన్సూరెన్స్ తో పాటు పెన్షన్ కూడా అందుతుందని చెప్పారు
అదేవిధంగా పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికులు కులదేవత రేణుక ఎల్లమ్మ దేవాలయం పనులు పూర్తి కాకపోవడంతో గీత కార్మికుల కుల సంఘం నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డిని కలిసి గుడి పనులు త్వరగా అయ్యేటట్టు సహకరించి పూర్తి చేయాలని కోరగా పరిపాటి సానుకూలంగా స్పందించి గుడి పనులను పూర్తి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది పరిపాటి రవీందర్ రెడ్డి కి గీత కార్మికులు కృతజ్ఞతలు చేశారు.