గుజరాత్‌ సీఎంగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం

అహ్మదాబాద్‌: గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా నాలుగోసారి ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయనతో గవర్నర్‌ కమలా బేనివాల్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి భాజపా అగ్రనేతలు అద్వానీ, గడ్కరీ, సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జెట్లీ, ముఖ్యమంత్రులు శిరాజ్‌సింగ్‌ చౌహాన్‌, రమణ్‌సింగ్‌, జయలలిత, రాజ్‌థాకరే, ప్రకాష్‌సింగ్‌ బాదల్‌, ఓం ప్రకాష్‌చౌతాలా తదితరులు హాజరయ్యారు.