గుడివాడ టికెట్‌ రావి వెంకటేశ్వరరావుకే:చంద్రబాబు

హైదరాబాద్‌: గుడివాడ మాజి ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఈ రోజు మధ్యాహ్నం చంద్రబాబు పమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గుడివాడలో ఎన్టీఆర్‌ పోటీ చేసినప్పుడు ఆయన గెలుపు ఆయన గెలుపు కోసం రావి తండ్రి కృషి చేశారన్నారు. 2004లో కొన్ని కారణాలవల్ల రావికి టికెట్‌ ఇవ్వలేకపోయామని 04లో ఆయనకు టికెటిస్తే 2009లోను గెలిచేవాళ్లమని ఈ సారి ఎన్నికల్లో తప్పకుండా రావి వెంకటేశ్వరరావుకు టికెట్‌ ఇస్తామని తెలిపారు.