గూడ్స్‌రైలులో చెలరేగుతుంన్నా మంటలు

ప్రకాశం: కురిచేడు వద్ద బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్స్‌రైలులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ వ్యాగన్‌ దగ్దమైంది. గుంతకల్‌ వైపునకు 26 వ్యాగన్లతో బొగ్గు రైలు వెళ్తోంది. ఈ ఉదయం 10వ వ్యాగస్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అప్రమతమైన  గార్డ్‌ రైలును నిలిపివేసి అధికారులకు సమాచారమందించాడు. వెంటనే ఘటనా స్థలనికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, రైల్వే అధికారులు ఇతర వ్యాగన్లతో ఇంజిన్‌ను విదదీసి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు.