గెలుపు కోసం కృషి చేయాలి

కొత్తగూడ, మే 24 (జనంసాక్షి):

నక్సల్స్‌ టార్గెటర్లను అప్రమత్తం చేసినట్లు కొత్తగూడ ఎస్సై సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై మాట్లాడుతూ ఏజెన్సీలో నక్లల్స్‌ కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో జిల్లా పోలీస్‌ అధికారుల సూచనల మేరకు వివిధ పార్టీల నాయకులను సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనపడినా, తిరిగినా సమాచారం అందించి శాంతి భద్రతలకు విఘాతం కల్గించకుండా సహకరించాలని ఆయన కోరారు.