గొర్రెల కాపరి కుటుంబానికి లక్ష పరిహారం

కలెక్టర్‌సంగారెడ్డి, జూలై 30 : సంగారెడ్డి కరెంట్‌ షాక్‌తో చనిపోయిన గొర్రెల కాపరి కుటుంబానికి మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు లక్ష పరిహారం సోమవారంనాడు అందజేశారు. 14-12-2009నాడు చేగుంట మండలం కరీంనగర్‌ గ్రామానికి చెందిన ఎస్‌. యెల్లం గొర్రెల కాపుతుండగా కరెంట్‌ షాక్‌ తగిలి చనిపోయాడు. కుటుంబ యజమాని చనిపోయినందున మృతుని భార్య లక్ష్మీకి లక్ష రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్‌ దినకర్‌బాబు అందజేశారు. ఈ కార్యక్రమంలో పశుసంహవర్దకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వి.లక్ష్మారెడ్డి, సహాయ సంచాలకులు డాక్టర్‌ కె.నర్సింహారావులు హాజరయ్యారు.