గొల్కొండ ఖజానా మ్యూజియంలో వస్తువులు మాయం
హైదరాబాద్: గొల్కొండలోని ఖజానా మ్యూజియంలో విలువైన వస్తువులు మయమయ్యాయి. నిజాం నవాబుల కాలం నాటి అరుదైన సంపదకు నిలయమైన ఈ మ్యూజియంలో కొన్ని విలువైన వస్తువులను దోంగలను అపహరించుకుపోయారు. మ్యూజియంలోని ఓ గోదాములో నిజాం కాలం నాటి అరుదైన వస్తువులను కొంత కాలంగా భద్రపరుస్తున్నారు. వీటినే దొంగలు తాజాగా ఎత్తుకుపోయినట్లు తెలుస్తోంది. దాదాపు 19 వేల ఫిరంగి గుళ్లతో పాటు సిపాయిలు ధరించే దుస్తులు, ఇతరత్రా వస్తువులు కూడా మాయమైన వాటిలో ఉన్నాయి. దీనిపై గొల్కొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భద్రతాపరమైన లోపాలే ఘటనకు కారణమని సమాచారం.