గోకుల్‌ చాట్‌ మృతులకు నివాళి

హైదరాబాద్‌,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): నగరంలోని కోఠి గోకుల్‌ చాట్‌ లో 2007 ఆగస్టు 25న జంట పేలుళ్ళు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలకు శ్రద్దాంజలి ఘటించారు. బాంబు పేలుళ్లు జరిగి 11 ఏళ్ళు గడుస్తున్నాప్పటికీ.. నిందితులను ఇప్పటికీ శిక్షించకపోవడం దారుణమని బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేశాయి. తమ కుటుంబ సభ్యులను పొట్టన పెట్టుకున్న వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వాలు బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో విఫలమయ్యాయని, కేసీఆర్‌ ప్రభుత్వం తమకు 5 లక్షలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుండి ¬ంమంత్రి నాయిని అందజేశారని బాధితుడు సయ్యద్‌ రహీం తెలిపారు.