గోపాలపట్నంలో మత్స్యకారుల అరెస్టు
నెల్లూరు: కృష్ణపట్నం రేవును ఈరోజు ఉదయం ముట్టడించనున్నట్లు ప్రకటించిన మత్స్యకారులు భారీ సంఖ్యలో ముత్తుకూరు వద్దకు చేరుకుని అక్కడి నుంచి కృష్ణపట్నం పోర్టుకు బయలుదేరారు. గోపాలపురం వద్ద వీరిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ ర్యాలీలో నాలుగు గ్రామాల మత్స్యకారులు పాల్గొన్నారు. అప్పటికే ఈ ప్రాంతంలోనూ, పరిసరాల్లోనూ భారీగా పోలీసులను మొహరించారు. 144సెక్షన్ విధించారు. అయినా వారు లెక్కచేయకుండా ముట్టడికి బయలుదేరారు. తమకు ఉపాధితోపాటు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని, మత్స్యకారులకోసం షప్పింగ్‌హార్బర్ నిర్మించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.