గ్యాంగ్‌రేప్‌ యువతిని

..న్యూఢిల్లీ,డిసెంబర్‌ 26 (జనంసాక్షి) :

దేశ రాజధాని ఢిల్లీలో గ్యాంగ్‌ రేపునకు గురైన యువతిని మెరుగైన వైద్యం కోసం బుధవారం అర్ధరాత్రి సింగపూర్‌కు తరలించారు. ఆమెకు ఇప్పటి వరకు ఢిల్లీలోని సప్ధర్‌జంగ్‌ ఆస్పత్రిలో చికిత్స అందించారు.  పరిస్థితి విషమించడంతో డాక్టర్ల సలహా మేరకు సింగపూర్‌కు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.    అవయవాల మార్పిడిలో ప్రఖ్యాతిగాంచిన సింగపూర్‌లోని మౌంట్‌ ఎలిజిబెత్‌ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందించను న్నారు. ఈ మేరకు ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్‌ ప్రేహన్‌, యుతిన్‌ మెహతా ఆధ్వర్యంలో ప్రత్యేక విమానంలో అర్ధరాత్రి సింగపూర్‌కు బయలు దేరారు. బాధితురాలి వెంట ఆమె తల్లిదండ్రులను కూడా తీసుకెళ్తున్నట్లు తెలిసింది. సప్ధర్‌జంగ్‌ ఆస్పత్రిలో ఆమె వారం రోజులుగా

చికిత్స పొందుతున్న విషయం విదితమే. వైద్యులు ప్రతి క్షణం ఆమెకు పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. బ్లడ్‌ ఇన్‌ఫెక్షన్‌తో ఆమె ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడంతో ఆస్పత్రి వర్గాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా త్వరితగతిన ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే గ్యాంగ్‌ రేప్‌ నిందితులను ఉరి తీయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు  కొనసాగుతున్నాయి.