గ్యాస్‌ కేటాయింపులపై రేపు నిర్ణయం

ఢిల్లీ: రత్నగిరికి గ్యాస్‌ కేటాయింపులపై రాష్ట్ర వినతిని పరిశీలించి రేపు నిర్ణయం తీసుకుటామని ప్రధాని హామీ ఇచారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రత్నగిరికి గ్యాస్‌ కేటాయింపుతో రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం ఏర్పడుతుందని వివరించామన్నారు. గ్యాస్‌ కేటాయింపుపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి 2008లో తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలించాలని, రిలయన్స్‌ గ్యాస్‌ ఎక్కువగా కేటాయించాలని, రాష్ట్రంలోని విద్యుత్‌ ప్రజెక్టులకు గ్యాస్‌ సరఫరా తగ్గించొద్దని కేంద్రాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. 2009లో కేటాయిస్తామన్న 75 శాతం గ్యాస్‌ను రాష్ట్రానికి అందివ్వాలని అభ్యర్థించినట్లు చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి పెంచి రాష్ట్రంలో విద్యుత్‌ కొరతను నివారిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.