గ్యాస్‌ ట్యాంకర్‌ పేలి 30 మందికి తీవ్రగాయాలు

తిరువనంతపురం: కేరళలోని కన్నూర్‌లో డివైడర్‌ను ఢీకొని గ్యాస్‌ ట్యాంకర్‌ పేలింది. ఈ ప్రమాదంలో 30 మందికితీవ్ర గాయాలయ్యాయి. ఇందులో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలనికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి సహాయకచర్యలు చేపట్టారు.