గ్రంథాలయ పాఠకుల హామీ నెరవేర్చిన జిల్లా గ్రంథాలయ చైర్మన్
గద్వాల నడిగడ్డ, మార్చి 15 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాలలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులు గ్రంథాలయంలో తమకు సరిపడా కుర్చీలు కావాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జంబు రామన్ గౌడను మంగళవారం కోరారు. దీనికి స్పందించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జంబురామన్ గౌడ బుధవారం రూ.20వేలు ఖర్చులతో మొత్తం32 కుర్చీలను తెప్పించి గ్రంథాలయానికి వచ్చే నిరుద్యోగులకు ఆయన సమకూర్చాడు. తక్షణమే స్పందించి తెప్పించినందుకు పాఠకులు గ్రంథాలయ సంస్థ చైర్మన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ యస్ సీనియర్ నాయకులు గట్టు శ్రీనాథ్, గ్రంథాలయ పాఠకులు, గ్రంథాలయ అధికారి రామాంజనేయులు,పార్ట్ టైం స్వీపర్స్ గోపాల్, భరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.