ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
హైదరాబాద్: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని సచివాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యదర్శి శివశంకర్ తెలుగులోనే మాట్లాడుతామని, తెలుగులోనే రాస్తామని, మాతృభాషకు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటామని సచివాలయ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు.