ఘనంగా ప్రపంచ కిడ్ని దినోత్సవం

 

 

 

 

 

 

యైటీంక్లయిన్ కాలని మార్చి 09 (జనంసాక్షి) :

ఆర్జీ-2 ఏరియా సింగరేణి సేవా సమితి భవన్ నందు ప్రపంచ కిడ్ని దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు కిడ్నీ జబ్బులపైన ఆరోగ్య అధికారిణి పద్మ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం మార్చి నెల రెండవ గురువారం రోజున ప్రపంచ కిడ్ని దినోత్సవాన్ని నిర్వహిస్తూ మూత్రపిండాల వ్యాదులపైన అవగాహన కల్పిస్తూ మూత్రపిండాలు ఆరోగ్యవంతంగా పని చేయాలంటే స్వచ్చమైన నీటిని తరచుగా తీసుకోవడం, క్రమము తప్పకుండా వ్యాయామము చేయడం, తక్కువ కాలరీలు కలిగిన ఆహారం తీసుకోవడం, ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమములో సీనియర్ పర్సనల్ అధికారి మండల శ్రీనివాస్, సేవా మహిళలు, ఫ్యాకల్టి మహిళలు, 8 ఇంక్లైన్ కాలనీ, పోతన కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.