ఘనంగా వైఎస్‌ జయంతి

హైదరాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని నగరంలో ఘనంగా నిర్వహించారు. పంజాగుట్ట సెంటర్‌లో ఉన్న వైఎస్‌ విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పీసీసీ అధ్యక్షుడ బొత్స, మంత్రులు దానం, కేవీపీ తదితరులు పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు.