ఘనంగా వైయస్సార్ వర్ధంతి

.

బోయిన్ పల్లి సెప్టెంబర్ 02 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్లా జిల్లా బోయిన్ పల్లి మండల కేంద్రం లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్ర వారం రోజున ఉమ్మడి రాష్ట్ర ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో అంబేద్కర్ చూడని వద్ద వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పథకాలను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. అనంతరం వృద్ధులకు చిన్న పిల్లలకు పండ్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి మాజీ జెడ్పిటిసి పులి లక్ష్మీపతి గౌడ్ మండల కాంగ్రెస్ నాయకులు, బోయిని ఎల్లేష్,ఎండి బాబు, నిమ్మ వినోద్, గంగిపల్లి లచ్చయ్య, దూస జనార్ధన్ తిరుపతిరెడ్డి, వంశీ, చంద్రగిరి వెంకటేష్ బోయిని మల్లేశం, రాజయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు, నక్క శ్రీకాంత్, దూది శశిధర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.