ఘన్ముకుల అంగన్వాడి కేంద్రంలో పోషణ్ అభియాన్ కార్యక్రమంలో

ఘన్ముకుల అంగన్వాడి కేంద్రంలో పోషణ్ అభియాన్ కార్యక్రమంలోముఖ్య అతిథులు కరీంనగర్ అడిషనల్ కలెక్టర్  గరిమా  అగర్వాల్ వీణవంక ఏప్రిల్4( జనం సాక్షి) వీణవంక   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాలకు పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం తీసుకోవడం వల్ల చిన్న పిల్లలు   సంపూర్ణ ఆరోగ్యం ఉంటారని కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు వీణవంక మండలంలోని ఘన్ముకుల గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో ఈరోజు ఏర్పాటు చేసిన పోషన్ అభియాన్ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ మండల ఎంపీపీ మూసి పట్ల రేణుక తిరుపతిరెడ్డి తో పాటు  ప్రజాప్రతినిధులతో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా అంగన్వాడీ పిల్లలకు  పాలు తో పాటు బాలామృతం పల్లిపట్టి తదితర పోషకాహారం వారు అందజేశారు అనంతరం కరీంనగర్   అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్ మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్భవతులు ఉన్నప్పుడు నుండి డెలివరీ అయినంతవరకు పిల్లలకు ఐదు సంవత్సరాల వరకు పౌష్టిక ఆహారాన్ని అందజేస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి  చేస్తున్నారని పిల్లలతో కుటుంబమంతా ఆరోగ్యంగా ఉండడానికి పౌష్టిక ఆహారంతో పాటు   తమ నివసించే  ఇల్లు చుట్టూ పరిసరాలు కూడా  పరిశుభ్రంగా ఉండాలని వారు తెలిపారు పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ టీచర్లను సూచించారు మహిళలు ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ  చూపాలని మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే వారి కుటుంబమంతా  సుఖ  సంతోషాలతో  ఉంటుందని వారు తెలిపారు గర్భిణి లుగా ఉన్నప్పుడు   సరైన పౌష్టిక ఆహారం తీసుకుంటే పుట్టబోయే పిల్లలు ఆరోగ్య వంతులుగా ఉంటారని  వారు అన్నారు  అనంతరం మండలంలోని ఆయా గ్రామాలలో ఘన్ముకుల.  గంగారం.ఎల్బాకా.రెడ్డిపల్లి. గ్రామాలలో దళిత బంధు యూనిట్లను పరిశీలించి వారికి తగు  సూచనలు ఇచ్చారు.చల్లూర్ పి హెచ్ సి లో ఆరోగ్య మహిళ కార్యక్రమానికి వారు సందర్శించారు   ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి. స్థానిక సర్పంచ్ జున్నుతుల సునీత మల్లారెడ్డి. ఎంపీటీసీ నాగిడి సంజీవ రెడ్డి. డిపిఓ వీర బుచ్చయ్య. డి డబ్ల్యు ఓ సబిత.డిప్యూటీ సి ఓ పవన్ కుమార్. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్ నాగార్జున. ఎంపీడీవో  శ్రీనివాస్ ఎంపీవో ప్రభాకర్ రెడ్డి.  సింగిల్ విండో డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి  ఐకెపి ఎపిఎం కొమురయ్య వైద్యులు డాక్టర్ అరుణ తోపాటు తదితరులు పాల్గొన్నారు.