ఘానంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవం
గుడిహత్నూర్,:మార్చ్.8 (జనం సాక్షి)… అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా గుడిహత్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు సర్పంచ్ జాదవ్ సునీత కేక్ కట్ చేసి సీట్లు పంచారు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించి తమ ప్రతిభను చాటుకోవాలన్నారు మారుతున్న కాలనికి అనుకూలంగా మహిళలు చైతన్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. అర్థ్భాగమైన మహిళలు సమానత్వం కోసం మగవారితో పోటిపడాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి పథకాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు