చంద్రగిరిలో విద్యాపక్షోత్సవాలను ప్రారంభించిన సీఎం

చంద్రగిరి:కుటుంబంలో అందరు చదువుకోవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు.చిత్తూరు జిల్లా చంద్రగిరి జడ్పీ పాఠశాలలో విద్యాపక్షోత్సవాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు.క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.వచ్చే మూడేళ్లలో అన్ని నిజయోజకవర్గాల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.డబ్బు సంపాదనే ధ్యేయమైతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని సీఎం జగన్‌ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.ఈకార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు కన్నా పార్థసారది తదితరులు పాల్గోన్నారు.

తాజావార్తలు