చంద్రుడిపై తొలి అడుగు మోపిన ఆర్మ్‌స్ట్రాంగ్‌ ఇక లేరు


చంద్రుడిపై తొలి అడుగు మోపిన ఆర్మ్‌స్ట్రాంగ్‌
సిన్‌సినాటి(అమెరికా) : మానవ చరిత్రలోనే అపురూపపమైన ఘట్లాన్ని నెలకొల్పిన నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ కన్నుముశారు. చంద్రుడిపై అడుగిడిన మొట్టమొడటి మనిషి మరలిరాని లోకాలకు తరలిపోయారు. ఆయనకు 82 సంవత్సరాలు. శనివారం హృదయ సంబంధమైన సమస్యలతో ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన ఎక్కడ తుదిశ్వాస విడిచారన్నది అందులో లేదు. ఈ నెల 8న ఆయనకు గుండె శస్త్రచికిత్స జరిగింది. అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో 1930 ఆగస్టు 5న ఆర్మ్‌స్ట్రాంగ్‌ జన్మించారు. ఆరో ఏటనే తొలిసారిగా విమానంలో ప్రయాణించారు. 1969 జులై 20న చందమామపై దిగిన అపోలో 11 వ్వోమనౌక సారథి ఆర్మ్‌స్ట్రాంగే 20వ శతాబ్దపు శాస్త్రవిజ్ఞానపరమైన సాహస యాత్రల్లో అత్యంత ప్రముఖమైనదిగా నాటి యాత్ర చరిత్రకెక్కింది. చంద్రుడిపై కాఉమోపిన అనంతరం. ఒక మనిషికి ఇది చిన్న అడుగేగాని, మావాళికి భారీ ముందంజ అంటూ ఆర్మ్‌స్ట్రాంగ్‌ అన్న మాట ఎప్పటికీ నిలిచిపోతుంది. నాడు చంద్రమండల యాత్రకు వెళ్లిన అమెరికా వ్యోమగాముల బృందంలో ఆర్మ్‌స్ట్రాంగ్‌, ఎడ్విన్‌ ఆల్డ్రిన్‌తోపాటు మైకేల్‌ కాలిన్స్‌ ఉన్నారు. ఎడ్విన్‌ ఆల్డ్రిన్‌తో కలిసి ఆర్మ్‌స్ట్రాంగ్‌ మూడు గంటలపాటు చంద్రుడి ఉపరితలంపై ఉన్నారు. ప్రయోగాల నిమిత్తం నమూనాలు సేకరించారు. అక్కడ ఛాయాచిత్రాలు కూడా తీశారు.