చల్లగ చూడు బారడి పోచమ్మ.
కోటగిరి మార్చి 10 జనం సాక్షి:-చల్లగా చూడు బారడి పోచమ్మ అంటూ కోటగిరి మండలంలోని రాంపూర్ గ్రామ భక్తులు బారడి పోచమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు గౌడ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహిం చారు.ఈ సందర్భంగా రాజేశ్వర్ మహారాజ్ ఆలయంలో అమ్మ వారికి ప్రత్యేక హోమ,పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని నైవేద్యాలను అమ్మవారికి సమర్పించారు.సాయంత్రం వేళ శివసత్తుల శిగాలతో, డప్పుచప్పుల మెళాలతో పెద్ద ఎత్తున గ్రామ మహిళలు బోనాలను ఊరేగింపు గా తీసుకు వచ్చి అమ్మవారికి బోనం అర్పించారు.ఈ బోనం మహోత్సవంలో గ్రామ ప్రజల తో పాటుగా చుట్టుపక్క గ్రామాల భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించు కొని ప్రత్యేక పూజలు నిర్వహించా రు.