చిన్న రాయుడి చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే
అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 8
పట్నం మీద మరోసారి మేఘం గర్జించింది ఉదయం చిరుజల్లులతో మొదలై సాయంత్రానికి గాలి దుమారం ఉరుములు మెరుపులు లేకుండా జోరుగా కురిసింది. మళ్లీ వర్షం విరుచుకు పడడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అల్వాల్ పట్టణ కేంద్రంలోని వివిధ కాలనీలను పరిశీలించారు. చిన్న రాయుడి చెరువు లో గుర్రపు డెక్కన్ తొలగించాలని అధికారులకు ఆదేశించారు. కాలనీవాసులకు దోమలు వివిధ సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారని. గుర్రపు డెక్కన్ తొలగించేందుకు కావలసిన పరికరాలు వెహికల్ సమకృస్తామని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. కాలనీలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సమస్యలు వస్తే మేము మీకు అండగా ఉంటామని కాలనీవాసులందరికీ భరోసా ఇచ్చారు. వర్షాలకు కాలనీలలో ఇబ్బందులు ఏర్పడినట్లయితే సంబంధిత జిహెచ్ఎంసి అధికారులకు సమాచారం ఇవ్వాలని తక్షణమే ఎమర్జెన్సీ టీములు వచ్చి బాధితులకు అండగా ఉంటారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చింతల విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి జిహెచ్ఎంసి ఎంటమాలజి అనిల్, స్థానిక నాయకులు నాగేశ్వరరావు, బలవంత రెడ్డి, హరిబాబు, అరవింద్, కవిత, జిహెచ్ఎంసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.