చిరుధాన్యాల పై విద్యార్థులకు అవగాహన.

మల్కాజిగిరి.జనంసాక్షి.మార్చి27.
చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం
వలన అనారోగ్య సమస్యలు రాకుండా పిల్లలు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగ పడతాయని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారినీ స్వాతి అన్నారు. సోమవారం మౌలాలి డివిజన్ లోని కమాన్ చౌరస్తా లోని ప్రభుత్వ పాఠశాలలో జాతీయ పోషణ పక్షోత్సవాల లో భాగంగా విద్యార్థులకు వైద్య పరీక్షలు వహించారు.పౌష్టికాహార లోపం,రక్త హీనతతో బాధపడుతున్న విద్యార్థులకు పోషకాహార పాకెట్లను అందజేశారు. పౌష్టిక ఆహారం చిరుధాన్యాలలో ఉండే విటమిన్ జీర్ణశక్తిని మెరుగుపరిచి తిన్న ఆహారాన్ని సులువుగా జీర్ణం అవ్వడానికి సహకరిస్తుందని విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు రామచంద్రారెడ్డి,సిడిపి ఓ సూపర్వైజర్ వింద్య వాహిని, అంగన్వాడీ టీచర్లు విజయలక్ష్మి, రమాదేవి,వెంకటలక్ష్మి,సంధ్య,అలియా తదితరులు పాల్గొన్నారు.