చీమలదండును తలపించే రీతిలో మార్చ్‌ జరిపితీరుతాం: హరీశ్‌రావు

హైదరాబాద్‌: కవాతు ద్వారా కాంగ్రెస్‌ అధిష్టానానికి తెలంగాణ ప్రజల సత్తా ఏమిటో చూపిస్తామని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా చీమలదండును తలపించే రీతిలో మార్చ్‌ జరిపితీరుతామని వరంగల్‌లో స్పష్టం చేశారు. తెరాస శ్రేణుల హైదరాబాద్‌ మార్చ్‌కు పెద్దఎత్తున్న తరలిరావాలని పిలుపునిచ్చారు. ముందస్తు అరెస్ట్‌లతో వేధింపులకు పాల్పడితే తెలంగాణ మంత్రులే బాధ్యత వహించాలని చెప్పారు.