చీరల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 20

నిరుపేద ఆడబిడ్డల సంతోషం కోసం సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టారని మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. అల్వాల్ మున్సిపల్ కార్యాలయంలోని మంగళవారం బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆడపడుచులకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు బహుమతిగా ఇస్తున్నారు. మహిళల సంరక్షణ కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి, డివిజన్ల కార్పొరేటర్లు రాజ్ జితేందర్ నాథ్, చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్, స్థానిక నాయకులు రాజసింహారెడ్డి, నాగేశ్వరరావు, బలవంత రెడ్డి, జ్యోతి యాదవ్, మహిళల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area