చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల మృతి
శ్రీకాళహస్తి : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం అక్కుర్తిలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఉదయం వెళ్లిన విద్యార్ధులు తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు చెరువులో గాలింపు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


