చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సుంకరి మల్లేష్ గౌడ్

చేర్యాల (జనంసాక్షి) జూన్ 24 : చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రెండవసారి చేర్యాల మండల పరిధిలోని ఆకునూరు గ్రామానికి చెందిన సుంకరి మల్లేశం గౌడ్ ఎంపికయ్యారు. వైస్ చైర్మన్ గా చేర్యాల పట్టణానికి చెందిన పూర్మ వెంకట్ రెడ్డి, డైరెక్టర్లుగా శనిగరం సత్యనారాయణ, తాటికొండ సదానందం, జిల్లా రాజేశం, బామాండ్ల పల్లి రాజు, నలగొప్పుల రాములు, బాశెట్టి బుచ్చి రాములు, బుట్టి ఆగమల్లు, మేక ఉమా మహేశ్వర్, జిల్లెల మహేందర్ రెడ్డి, వంగ రామరాజు, భీమ రాజు, మెరుగు కృష్ణ లను ఎంపిక చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా సుంకరి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం ఎంతగానో కృషి చేస్తుందని, రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించి రైతన్నను అన్ని విధాల ఆదుకున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని వారన్నారు. రైతులకు ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం చూపి రైతంగం అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని వారు అన్నారు. రెండవసారి చైర్మన్ గా అవకాశం కల్పించిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి కేసీఆర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.