అగాథంలోకి తెలంగాణ
సెప్టెంబర్ 06(జనంసాక్షి): హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో విద్యా వ్యవస్థ అధపాతాళంలోకి పోతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీల్లో ఇప్పటికీ పాఠ్య పుస్తకాలు అందలేదు. ఈ అంశంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.