గణేశ్‌ నిమజ్జన ప్రక్రియలో సీఎం రేవంత్‌

` తక్కువ సెక్యూరిటీ జనంలో కలియదిరిగిన ముఖ్యమంత్రి
` ఎలాంటి ముందస్తు షెడ్యూల్‌ లేకుండా ప్రత్యక్షమై అందరీని ఆశ్చర్యపరిచిన సీఎం
` పరిమిత వాహనాలతో సాదాసీదాగా పర్యటన
` ఓ వైపు సందర్శిస్తూనే మరోవైపు ప్రజలకు జాగ్రత్తగా ఉండాని సూచనలు
హైదరాబాద్‌(జనంసాక్షి):హుస్సేన్‌ సాగర్‌ వద్ద నిమజ్జనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. భక్తులు, సందర్శకులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. భాగ్యనగర్‌ ఉత్సవ సమితి వేదికపై నుంచి భక్తులకు అభివాదం చేశారు. ’గణపతి బప్పా మోరియా’ అంటూ భక్తులతో కలిసి నినాదాలు చేశారు. క్రేన్‌ నెం.4వద్ద నిమజ్జనాలను పరిశీలించారు. నిమజ్జనం ఏర్పాట్లను కలెక్టర్‌ హరిచందన సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా విధుల్లో పాల్గొన్న అన్ని విభాగాల సిబ్బందిని సీఎం అభినందించారు. నిమజ్జనాలు పూర్తయ్యే వరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. ముందస్తు సమాచారం లేకుండా సాదాసీదాగా సీఎం రేవంత్‌రెడ్డి హుస్సేన్‌ సాగర్‌ వద్ద ప్రత్యక్ష కావడంతో భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. గణేశ్‌ నిమజ్జనాల సందర్భంగా హుస్సేన్‌ సాగర్‌ వద్దకు సీఎం వచ్చి ఏర్పాట్లను పరిశీలించడం పట్ల భాగ్యనగర్‌ ఉత్సవ్‌ సమితి ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. నగర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఈ నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌ వద్ద జరుగుతున్న గణేష్‌ నిమజ్జనాల వేడుకను సీఎం రేవంత్‌ రెడ్డి సందర్శించారు. ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్వయంగా ట్యాంక్‌బండ్‌కు సీఎం వచ్చినట్లు- సమాచారం. నిమజ్జనాల నేపథ్యంలో అధికారులు చేసిన భద్రత ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. అనంతరం ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి సాధారణ వ్యక్తిగా ట్యాంక్‌ బండ్‌ వద్దకు వచ్చి నిమజ్జనం ఏర్పాట్లు- పరిశీలించారు. రేవంత్‌ రెడ్డి రావడంతో భారీగా ప్రజలు తరలివచ్చారు. ప్రజలకు అభివాదం చేస్తూ.. ముందుకు కదిలారు. అత్యంత తక్కువ సంఖ్యలో భద్రత సిబ్బందితో.. మూడు కార్ల ఎస్కార్ట్‌తో సీఎం ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. నిమజ్జనం జరుగుతున్న తీరును అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. గణేశ్‌ నిమజ్జనాల సందర్భంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని తెలిపారు. వినాయక నిర్వాహకులు, ప్రజలు అధికారులకు సహకరించాలని సీఎం స్పష్టం చేశారు.
సాదాసీదాగా ప్రత్యక్షమైన రేవంత్‌ రెడ్డి
అకస్మాత్తుగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎలాంటి షెడ్యూల్‌ లేకుండా ప్రత్యక్షమై అందరీని ఆశ్చర్యపరిచారు. ముఖ్యమంత్రిని చూడగానే అక్కడున్న భక్తులు ఆశ్చర్యపోతూ అభివాదం చేశారు. గణేశ్‌ నిమజ్జనాలను సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. భాగ్యనగర్‌ ఉత్సవ సమితి వేదిక పైనుంచి ప్రజలకు అభివాదం చేసిన సీఎం భక్తులతో కలిసి ‘గణపతి బప్పా మోరియా’ అని నినాదాలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అనంతరం క్రేన్‌ నంబర్‌ 4 వద్ద నిమజ్జనం ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. నిమజ్జనం ఏర్పాట్ల గురించి సీఎంకు హైదరాబాద్‌ కలెక్టర్‌ హరిచందన దాసరి వివరించారు. విధుల్లో పాల్గొన్న అన్ని విభాగాల సిబ్బందిని ఆయన అభినందించారు. నిమజ్జనాలు పూర్తయ్యే వరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సిబ్బందికి సూచించారు. భక్తులు, సందర్శకులు ఇళ్లకు క్షేమంగా చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సాదాసీదాగా సీఎం రేవంత్‌రెడ్డి హుస్సేన్‌ సాగర్‌ వద్ద ప్రత్యక్ష కావడంతో భక్తులు కొంత ఆశ్చర్యానికి గురయ్యారు. గణేశ్‌ నిమజ్జనాల సందర్భంగా ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతానికి సీఎం వచ్చి ఏర్పాట్లను పరిశీలించడం పట్ల భాగ్యనగర్‌ ఉత్సవ్‌ సమితి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి రావడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఫోటోలు దిగడానికి పోటీ పడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా సాధారణంగా వచ్చి గణేశ్‌ నిమజ్జనాల తీరును ఎప్పుడూ పరిశీలించలేదని పలువురు చెబుతున్నారు. అనంతరం ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్‌?లోని తన నివాసానికి వెళ్లారు. మరోవైపు హుస్సేన్‌సాగర్‌లో గణపతి విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది. ట్యాంక్‌బండ్‌ మీదకు గణపతి విగ్రహాలు వేలాదిగా తరలివస్తున్నాయి. భక్తులతో హుస్సేన్‌సాగర్‌ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. జనసంద్రంగా ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ ప్రాంతాలు మారాయి. ప్రధాన, చిన్నచిన్న చెరువుల్లోనూ గణేశ్‌ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. మినీట్యాంక్‌ బండ్‌గా పిలుచుకునే సరూర్‌నగర్‌ చెరువులోనూ వేలాది విగ్రహాల నిమజ్జనం అవుతున్నాయి. చెరువులతో పాటు బేబీపాండ్స్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. కాగా హైదరాబాద్‌లో ఎంజే మార్కెట్‌ మీదుగా ట్యాంక్‌బండ్‌ వరకు గణేశ్‌ శోభాయాత్రలు కొనసాగుతున్నాయి. దీంతో గణేశ్‌ విగ్రహాల వాహనాలు, భక్తులతో రోడ్లు కిటకిటలాడుతున్నాయి. పలు ప్రాంతాల నుంచి వస్తున్న గణనాథులను ఎంజే మార్కెట్‌ మీదుగా పోలీసులు తరలిస్తున్నారు. బాలాపూర్‌ గణేశుడి శోభాయాత్ర పాతబస్తీలో ఎంజే మార్కెట్‌ వద్దకు చేరుకుంది. హైదరాబాద్‌లో గణపతుల నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతోందని డీజీపీ జితేందర్‌ తెలిపారు. ఖైరతాబాద్‌ గణనాథుడి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని, సాయంత్రం వరకు బాలాపూర్‌ గణేశుడి నిమజ్జనం పూర్తవుతుందని వెల్లడిరచారు. రికార్డుల ప్రకారం రాష్ట్రంలో 1.66 లక్షల గణపతి విగ్రహాలు ఏర్పాటు చేశారని, ఇప్పటి వరకు 80 వేల గణపతి విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యిందని ప్రకటించారు. ఇంకా 36 వేల విగ్రహాల నిమజ్జనం పూర్తి కావాల్సి ఉందన్నారు. నిమజ్జనం కోసం ప్రత్యేక బలగాలు విధులు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు.