బిగ్ బాస్‌లోకి ఆరుగురు కామ‌న్ మ్యాన్స్

సెప్టెంబర్ 05(జనంసాక్షి):తెలుగు టెలివిజన్ చరిత్రలో బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు పొందిన బిగ్ బాస్ ఇప్పుడు 9వ సీజన్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లు సూపర్ సక్సెస్ కావడంతో ఈసారి మరింత గ్రాండ్‌గా, కొత్త ఫార్మాట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్టార్ మా ఛానల్ సెప్టెంబర్ 7 నుండి ఈ షో ప్రసారమయ్యేలా ఏర్పాట్లు చేస్తుంది. ఈ సీజన్‌లో ప్రత్యేకత ఏమిటంటే, సెలబ్రిటీ కంటెస్టెంట్లతో పాటు కామన్ మాన్స్‌కిఈ కూడా అవకాశం కల్పించారు. ఇందుకోసం ‘అగ్ని పరీక్ష’ అనే ప్రత్యేక గేమ్ షో నిర్వహించారు. అందులో పాల్గొన్న 45 మంది నుంచి మొదట 15 మందిని ఎంపిక చేశారు. తర్వాత వారి నుంచి మొదటగా ఐదుగురు హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు ప్రకటించినా, తాజా సమాచారం ప్రకారం ఆరుగురు కామన్ కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.