చైనాలో కొండ చరియలు విరిగిపడి 44 మంది మృతి
బీజింగ్: చైనాలోని యన్నన్ ప్రాంతంలోని గయోపో గ్రామంలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 44 మంది మృతి చెందారు. భారీగా కురుస్తున్న మంచులోనే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొండ చరియలు విరిగిపడటంలో గ్రామంలో 14 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మొత్తం 46 మంది గల్లంతుకాగా 44 మృత దేహాలను వెలికితీశారు. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది.