ఛార్జీలు పెంచినా ఏడాదికి రూ.372 కోట్లు నష్టం : ఏకే ఖాన్‌

హైదరాబాద్‌: ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు పెంచేందుకే ఛార్జీలు పెంచినట్లు ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్‌ తెలిపారు. ఈ ఏడాది రెండు వేల కొత్త బస్సులను ప్రవేశ పెడుతున్నట్లు ఆయన చెప్పారు. ఛార్జీలను స్వల్పంగానే పెంచామని ఆయన పేర్కొన్నారు. ఛార్జీలు పెంచినా ఆర్టీసీకి ఏడాదికి రూ. 372 కోట్లు నష్టం వస్తుందని ఎండీ తెలిపారు.