ఛైల్డ్హోమ్ నిర్వాహకుడి అరెస్టు

చైల్డ్హోం నిర్వాహకుడు ఆర్.ఎస్. మీనా తమను లైంగికంగా వేధిస్తూ, వీడియోలు తీస్తున్నాడని ఆరుగురు చిన్నారులు ఫిర్యాదు చేయడంతో అతడ్ని పోలీసులు అరెస్టుచేశారు. బాధితులంతా పదేళ్లలోపు చిన్నారులే. అనంతరం పోలీసులు మాట్లాడుతూ.. నిందితుడు మొబైల్ ఫోన్లో అభ్యంతకర వీడియోలు, సెల్ఫీలు తీశాడని వెల్లడించారు. బాధిత చిన్నారుల నుంచి వాంగ్మూలం తీసుకున్నట్లు సీనియర్ పోలీస్ సతీశ్ కైన్ తెలిపారు. వైద్య పరీక్షల్లోనూ వారిపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయినట్లు వెల్లడించారు.
సంరక్షణ గృహంలో 50 మంది ఆరు నుంచి పదేళ్ల వయస్సున్న చిన్నారులే ఉన్నారు. దిల్లీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సందీప్ కుమార్ బాధిత చిన్నారులను కలిసి మాట్లాడారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.