జగన్‌ను కలిసిన ఎంపీ ఓవైసి

హైదరాబాద్‌: చంచల్‌గూడ్‌ జైలో జగన్‌ను కలిసిన హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసి, పలువురు ప్రముఖులు కలుసుకున్నారు. ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, మాజీ  మంత్రి పిల్లి సుబాష్‌ చంద్రబోస్‌, ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, బాబూరావు, బాలరాజు, ఎమ్మెల్సీ జూపూడి, వైఎస్‌ సోదరుడు వివేకానందరెడ్డి జగన్‌ను కలిశారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జగన్‌ తెలిపినట్లు ఆయన స్పష్టం చేశారు. యూపీఏ బలపరిచిన రాష్ట్రపతి ఆభ్యర్థికి మద్దతు తెలపాలని తాను జగన్‌ను కోరానని అసదుద్దీన్‌ ఓవైసీ తెలిపారు.2014 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఢోకా ఉండదని ఓవైసీ తెలియజేశారు.