జడ్జి నర్సింహరావు అరెస్టు

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కుంభకోణంలో జడ్టి లక్ష్మీనర్సింహరావు ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు తెల్లవారుజాయున పోలీసులు ఆయనను అరెస్టు చేసి ఉస్మానియా ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమితం తరలించారు.   బెయిల్‌ ఫర్‌ సేల్‌ కేసులో నిన్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన విషయం తెలిసిందే.అయితే వైద్య పరీక్షలు పూర్తియిన తర్వాత ఆయనను సిటీ సివిల్‌ కోర్టు ప్రాంగణంలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. గతంలో స్మాల్‌ కాజెస్‌ కోర్టు జడ్జిగా లక్ష్మీనర్సింహ పనిచేసిన విషయం తెలిసిందే.