జయశంకర్‌కు నివాళులర్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను తెరాస ఘనంగా నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వేడుకలకు హాజరయ్యారు. ఆచార్య జయశంకర్ విగ్రహానికి సీఎం పూలమాల వేసి అంజలి ఘటించారు. తెలంగాణ ఉద్యమంలో ఆచార్య జయశంకర్ సేవలను స్మరించుకున్నారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, తెరాస నేతలు… జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జయశంకర్ సేవలు మరువలేనివని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని నేతలు ప్రతినబూనారు.
అసెంబ్లీహాలులో జయశంకర్ జయంతి వేడుకలు
తెలంగాణ అసెంబ్లీ హాలులో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా జరిగాయి. శాసనమండలి ా’య్రర్మన్ స్వామ్ణిొడ్, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జయశంకర్ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.


