జానారెడ్డితో టీడీపీ నేతల భేటీ
హైదరాబాద్, మార్చి 16: టీ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్రావు, రేవంత్రెడ్డి.. అసెంబ్లీ విపక్ష నేత జానారెడ్డితో భేటీ అయ్యారు. అసెంబ్లీలో వారిపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని జానారెడ్డికి వివరించారు. ఈ వ్యవహారంలో రాష్ట్రపతిని కలవనున్నట్టు, ఇందుకు కాంగ్రెస్ నాయకులు సహకరించాలని వారు కోరారు. ఇందుకు జానారెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం.