జిన్న రాజేందర్ పల్లవి లకుచిరు సన్మానం.
జిన్న రాజేందర్ పల్లవి లకుచిరు సన్మానం.మల్లాపూర్ మార్చి:28 (జనంసాక్షి) మండలంలోని సాతారం గ్రామంలో రేణుక ఎల్లమ్మ ఆలయం లో కళ్యాణమండపానికి 2 లక్షల 50 వేలు విరాళాలు అందజేసిన జిన్న రాజేందర్ పల్లవి లకు మరియు వారి కుటుంబ సభ్యులకు గీతా కార్మిక సంఘం ఆధ్వర్యంలో వారికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా చిన్న రాజేందర్ మాట్లాడుతూ తన తల్లిదండ్రుల కీర్తిశేషులు జిన్నభారత నరసయ్య జ్ఞాపకార్థం తన వంతు ఆర్థిక సహాయంతో కళ్యాణమండపం పూర్తి పనులను చేయిస్తానని అన్నారు. ఈ సందర్భంగా గీతా కార్మిక సంఘం అధ్యక్షులు చెక్కపల్లి కిషన్ గౌడ్ ఉపాధ్యక్షులు బడే రాజేందర్ వారికి పూలమాలలు వేసి శాలువాలతో సన్మానించారు ఈ సన్మానానికి ముఖ్యఅతిథిగా మల్లాపూర్ ఎస్సై జి నవీన్ కుమార్ పాల్గొన్నారు. ఎస్ఐకి, యువజన సంఘాల జిల్లా అధ్యక్షుడు బొడ్డు రాజేష్ కు సంఘ సభ్యులు సన్మానం చేశారు. రాజేందర్ తరహా యువకులు ముందుకు రావాలని వారు అన్నారు.