టెండర్ల విలువ నిబంధనల విశేషాధికారం

న్యూఢిల్లీ: జాతీయ ప్రయేజనాల దృష్ట్యా టెండర్ల విలువ ఎంతుండాలో నిబంధనలు ఎలా ఉండాలో నిర్ణయించే విశేషాధికారం ప్రభుత్వానికుంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టైర్ల సరఫరా టెండర్లకు సంబంధించి కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ (కేఎస్‌ఆర్టీసీ) 2005లో జారీ చేసిన నిబంధనలను సవాలు చేస్తూ మిషిగాన్‌ రబ్బర్‌ (ఇండియా) లిమిటెడ్‌ దాఖలు చేసిన కేసులో జస్టిస్‌ పి.సదాశివం, జస్టిస్‌ గొగోయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. టైర్ల సేకరణలో పాల్గొనే సంస్ధల అర్హతలను నిర్ణయించడంలో ఉన్నతాధికారులు సక్రమంగానే వ్యవహరించారు. ఇందులో కోర్టులో జోక్యం చేసుకోవడానికేమీ లేదు అని సుప్రీ ధర్మాసనం వ్యాఖాయనించింది.