టైర్ల దుకాణంలో అగ్నిప్రమాదం
చైతన్యపురి : దిల్‌సుఖ్‌నగర్‌లో శారదానగర్‌లో ఇళ్ల మద్యన ఉన్న టైర్ల మరమ్మతుల దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలు అర్పివేయడంతో పెద్ద ప్రమాదమేమి చోటుచేసుకోలేదు.